: భేషజాలు మరచి కలసిపోయిన ఒబామా
తాను ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడిని అన్న విషయాన్ని ఒబామా కాసేపు మరచిపోయారు. ఈ ఘటన రాష్ట్రపతి భవన్ కు ఆయన వచ్చినపుడు జరిగింది. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన తరువాత తొలుత కేంద్ర మంత్రులను ఒబామాకు ప్రధాని మోదీ పేరు పేరునా పరిచయం చేశారు. ఒక్కొక్కరితో కరచాలనం చేస్తూ వచ్చిన ఒబామా, చివర్లో తన మంత్రివర్గ సహచరులను దగ్గరుండి ప్రణబ్ ముఖర్జీ, మోదీలకు పరిచయం చేశారు. ముందు ప్రణబ్, వెనుక మోదీ నిలబడి ఉండగా, మధ్యలో ఉన్న ఒబామా బేషజాలు మరచి, ప్రొటోకాల్ ను కాసేపు పక్కబెట్టి తనతో వచ్చిన అమెరికా మంత్రులను, అధికారులను నవ్వుతూ పరిచయం చేశారు.