: ఢిల్లీ చేరుకున్న ఒబామా దంపతులు
ఈ ఉదయం 9:35 నిమిషాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రయాణిస్తున్న 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానం పాలం వైమానిక విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. రన్ వే పై నుంచి నిర్దేశిత ప్రదేశానికి రావడానికి విమానం 10 నిమిషాల సమయం తీసుకుంది. ఆయనకు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. విమానం డోర్ నుంచి బయటకు వచ్చిన ఆయన అందరికీ తనదైన శైలిలో చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అక్కడినుంచి ఆయన 'బీస్ట్' వాహనంలో హోటల్ కు బయలుదేరారు.