: భారత గగనతలంలోకి 'ఎయిర్ ఫోర్స్ వన్'... రక్షణగా యుద్ధ విమానాలు... మరో గంటలో లాండింగ్


శ్వేతసౌధాదీశుడు, అమెరికా అధినేత బరాక్ ఒబామా ప్రయాణిస్తున్న'ఎయిర్ ఫోర్స్ వన్' భారత గగన తలంలోకి ప్రవేశించింది. ఆయన విమాన గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ప్రత్యేక రాడార్ బృందం ఒబామా విమానం 9:35కు ఢిల్లీలోని పాలం వైమానిక విమానాశ్రయానికి చేరుతుందని అంచనా వేసింది. ఈ విమానానికి భారత్, అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు రక్షణ కల్పిస్తున్నాయి. కాగా, పాలం విమానాశ్రయంపై పొగ మంచు దట్టంగా వుండటం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. విమానం దిగలేని పరిస్థితి వస్తే 'ఎయిర్ ఫోర్స్ వన్'ను జైపూర్ కు పంపనున్నారు. అదే జరిగితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు జరుగుతాయి.

  • Loading...

More Telugu News