: ‘వుయ్ ఆర్ బ్యాక్ ఇన్ ఢిల్లీ’... అత్యాచార బాధితురాలికి ఉబెర్ మెసేజ్... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు


సుమారు నెలన్నర నుంచి కనపడని ఉబెర్ ట్యాక్సీలు మళ్ళీ ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. అంతేకాదు, వస్తూ వస్తూ అత్యాచార బాధితురాలి సెల్‌ ఫోన్‌కు, ఇ- మెయిల్ కు ఆ కంపెనీ మెసేజ్ కూడా పంపింది. ‘వుయ్ ఆర్ బ్యాక్ ఇన్ ఢిల్లీ' అంటూ మెసేజ్‌ రావడంతో సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. దేశ రాజధానిలో మహిళలకు రక్షణ ఏ మాత్రం లేదనడానికి ఇది ఉదాహరణ అని బాధితురాలి తరఫున న్యాయవాది వ్యాఖ్యానించారు. గత సంవత్సరం డిసెంబర్ 6న ఆ యువతి ఉబెర్ క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా, క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, లైసెన్స్‌ లకు ఆమోదం పొందకుండానే ఉబెర్ తన సేవలను ప్రారంభించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News