: చిన్న జాగ్రత్తలు తీసుకుంటే...వ్యాధులు దూరంగా ఉంటాయి: సినీ నటి గౌతమి
చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద వ్యాధులు దూరంగా ఉంటాయని సినీ నటి గౌతమి అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో జరుగుతున్న అంతర్జాతీయ కేన్సర్ సదస్సుకు హాజరయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేన్సర్ కు భయపడకుండా వైద్యం తీసుకుంటే నయమవుతుందని అన్నారు. బ్రెస్ట్ కేన్సర్ ను చివరి దశలో గుర్తిస్తారనడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. గుర్తించినా నిర్లక్ష్యం చేస్తారని ఆమె తెలిపారు. వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తరువాత జీవన శైలి మరింత మెరుగుపడిందని ఆమె చెప్పారు.