: ముత్తయ్యకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకున్న వివేక్ ఒబెరాయ్


బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అనంతపురం జిల్లాలోని మత్తయ్యకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకోబోతున్నారు. జిల్లాలోని వెంకటాపురంలో నిర్వహించిన పరిటాల రవి వర్థంతిలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మీడియాతో మాట్లాడుతూ, ఇక నుంచి తనను అనంతపురం జిల్లా వాసిగా గుర్తించాలని కోరారు. పరిటాల రవి తనకు సోదరుడు వంటి వారని, జిల్లా అభివృద్ధిపై ఆయన ఎన్నో కలలు కన్నారని అన్నారు. ఆ అభివృద్ధిలో భాగమయ్యేందుకే తాను ముత్తయ్యకుంట్ల గ్రామాన్ని దత్తత చేసుకోబోతున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News