: భారత్ ఆశలన్నీ విరాట్ చుట్టూనే: ద్రవిడ్
టీమిండియా వరల్డ్ కప్ ఆశలన్నీ విరాట్ కోహ్లీ చుట్టూ అల్లుకున్నాయని దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. టీమిండియా వరల్డ్ కప్ ఆశలపై ఆయన విశ్లేషిస్తూ, ప్రస్తుతం టీమిండియా విరాట్ పై ఆధారపడినట్టు కనబడుతోందని అన్నారు. అంచనాలకు తగ్గట్టు విరాట్ రాణిస్తే భారత్ లాభపడుతుందని ఆయన తెలిపారు. విరాట్ తో పాటు రైనా, ధోనీ రాణించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలబెట్టుకోవాలంటే కోహ్లీ రాణించడం ఎంతో అవసరం అని స్పష్టం చేశారు. భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ గమనిస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుందని ఆయన తెలిపారు. కోహ్లీని లక్ష్యం చేసుకునే ప్రత్యర్థులు ప్రణాళికలు రచిస్తారని ఆయన సూచించారు. ఇకపోతే బౌలర్లు ఎంతో మెరుగుపడాల్సి ఉందని ఆయన చెప్పారు. బౌలింగ్ లోపాలు అభిమానులను, ఆటగాళ్లను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆయన తెలిపారు.