: పీడీపీ అధ్యక్షురాలిగా మెహబూబా ఏక్రగ్రీవ ఎన్నిక


పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలి మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆమె మూడేళ్ల పాటు అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. 2003 నుంచి మెహబూబానే పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి కూడా తనే ఎన్నిక కావడం విశేషం. మోహబూబా తండ్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ 2002లో జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన స్థాపించిన ఈ పార్టీ ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాలు గెలుచుకుంది. కాగా ఇంతవరకు అక్కడ ప్రభుత్వం ఏర్పడకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News