: లోకేష్ పై విమర్శలు తగదు: మంత్రి గంటా


ఏపీ ప్రభుత్వంలో ఎటువంటి హోదా లేని నారా లోకేష్ మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తున్నాడంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. మంత్రులతో లోకేష్ సమీక్ష చేస్తున్నాడని విమర్శించడం తగదన్నారు. మంత్రుల కంటే ముందు తాము పార్టీ కార్యకర్తలమని చెప్పారు. ప్రభుత్వానికి సూచనలిచ్చేందుకు పార్టీ కార్యచరణ బృందం ఉందన్నారు. ఈ బృందంలో లోకేష్ సభ్యుడని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేస్తే తప్పుగానీ, ప్రజా సంక్షేమానికి పార్టీ తరపున సూచనలిస్తే తప్పేంటని గంటా తిరుగు ప్రశ్నించారు. 'ఆకర్షణీయ ఆంధ్రప్రదేశ్' అంశంపై ఎన్టీఆర్ భవన్ లో సమావేశం ముగిసిన అనంతరం గంటా మీడియాతో మాట్లాడారు. ఆకర్షణీయ ఏపీ అంటే గ్రామానికి కోట్లాది నిధులు వెచ్చించడం కాదన్నారు. ప్రజల ఆలోచనలో మార్పు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలనేదే లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధిలో భాగస్వాములైన వారికి పన్ను రాయితీ పరిశీలిస్తున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News