: సత్ఫలితాలిస్తున్న ఆంధ్రా బ్యాంకు వినూత్న చర్యలు... వసూలవుతున్న మొండి బకాయిలు!


మొండి బకాయిల వసూలు కోసం ఆంధ్రా బ్యాంకు చేపట్టిన వినూత్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అటువంటి రుణాలను వసూలు చేసేందుకు బ్యాంకు సిబ్బది ‘ఆందోళన’ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ వినూత్న ఆందోళనల్లో భాగంగా 'బకాయిలు చెల్లించండి మహా ప్రభో' అంటూ ప్లకార్డులు, బ్యానర్లు చేతబట్టిన బ్యాంకు సిబ్బంది బకాయిదారుల ఇళ్ల ముందు బైఠాయిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటిదాకా వాయిదాలు చెల్లించకపోతే ఏం చేస్తారులే అనుకున్న రుణ గ్రహీతలు, బ్యాంకు సిబ్బంది వినూత్న నిరసనలతో బెంబేలెత్తిపోయారు. మరోమారు తమ ఇళ్ల ముందు ఆందోళనలు చేపట్టవద్దని చెబుతూ కొందరు బకాయిదారులు వాయిదాల చెల్లింపులను ప్రారంభించారట. దీంతో బ్యాంకు సిబ్బంది ఆనందంలో మునిగితేలుతున్నారు.

  • Loading...

More Telugu News