: చేసేదంతా చేస్తూ... మాపై నిందలా?: టీ సర్కారుపై దేవినేని ఆగ్రహం


కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిపై ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన... పోతిరెడ్డిపాడు, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీరు కిందకు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ లో నీటిని నిల్వ చేస్తోందని ఆయన ఆరోపించారు. అయితే సాగర్ నుంచి నీటిని కిందకు విడుదల చేసేందుకు తెలంగాణ సర్కారు ససేమిరా అంటోందని ఆయన విరుచుకుపడ్డారు. కృష్ణా జలాలపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తెలంగాణ వైఖరి వల్ల కృష్ణా డెల్టా ఎడారిగా మారే ప్రమాదముందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదంతా వారు చేస్తూ తమపై, తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ సర్కారు ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాల్సి ఉందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News