: బాలీవుడ్ ‘ఖాన్’ల భార్యలు లవ్ జిహాద్ బాధితులే: హిందూ మహాసభ
బాలీవుడ్ ప్రముఖ నటులు ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సైఫ్ అలీఖాన్ ల భార్యలు కూడా లవ్ జిహాద్ బాధితులేనని హిందూ మహాసభ ఆరోపించింది. ఈ విషయాన్ని హిందూ మహాసభ తన వారపత్రిక ‘హిందూ సభా వార్తా’ తాజా సంచికలో ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొంది. తమ భార్యలు కిరణ్ రావు, గౌరీ, కరీనా కపూర్ లపై ప్రేమే ఉంటే ఆమిర్, షారుఖ్, సైఫ్ లు హిందూమతంలోకి రావాలని కూడా ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం ఈ కథనం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.