: కొద్దిసేపట్లో నవ్వుల రేడు ఎంఎస్ నారాయణ అంతిమ యాత్ర... ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు
టాలీవుడ్ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు నేడు హైదరాబాదులోని ఎర్రగడ్డ శ్మశాన వాటికలో జరగనున్నాయి. అనారోగ్యంతో ఎంఎస్ నారాయణ నిన్న కిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఎంఎస్ నారాయణ అంత్యక్రియలను వికారాబాద్ లోని ఫాంహౌజ్ లో నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు నిన్న అనుకున్నారు. అయితే అంత్యక్రియలను ఎర్రగడ్డ శ్మశాన వాటికలోనే పూర్తి చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. వెంకటగిరిలోని స్వగృహం నుంచి నేటి ఉదయం 10.30 గంటలకు ఎంఎస్ నారాయణ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. 11 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.