: గూగుల్ ఛైర్మన్ తో బాబు భేటీ...పర్యటన మరో రోజు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గూగుల్ ఛైర్మన్ ఎరిక్ స్మిమ్ డట్ తో సమావేశమయ్యారు. సుమారు అర్ధగంట పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. చర్చ సందర్భంగా ఏపీలో డిజిటల్ లిటరసీ పథకం, డిజిటల్ ఏపీకి సహకరించాలని బాబు ఆయనను కోరారు. దీంతో ఆయన సహకరిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. అనంతరం తన పర్యటనను ఒకరోజు పొడిగిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. పెట్టుబడి దారుల ఆసక్తి మేరకు తన పర్యటన పొడిగిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతుందని ఆయన చెప్పారు.