: విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు
విశాఖపట్టణంలో మూడు రోజులపాటు జరగనున్న విశాఖ ఉత్సవ్ ను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంప్రదాయ కళలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖపట్టణంను కేంద్రం స్మార్ట్ సిటీగా ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. ఈ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అత్యుత్తమ సాకేంతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని ఆయన తెలిపారు. విశాఖను మేజర్ సిటీగా అభివృద్ధి బాటపట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు.