: మిణుకు మిణుకుమంటున్న టీమిండియా ఫైనల్ ఆశలు!
ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత్ ఫైనల్ ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించి నేరుగా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడంతో మిగిలిన స్థానానికి ఇంగ్లండ్, భారత్ జట్లు పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్ జట్టు టీమిండియాపై బోనస్ పాయింట్ తో విజయం సాధించినందున ఆ జట్టు మరో విజయం సాధిస్తే ఫైనల్ కు చేరుంతుంది. టీమిండియా ఫైనల్ కు చేరాలంటే మాత్రం బోనస్ పాయింటుతో పాటు మెరుగైన రన్ రేట్ తో విజయం సాధించాలి. అలాగే ఈ వన్డే తరువాత జరగాల్సిన రెండు వన్డేల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఇదే టైంలో ఇంగ్లండ్ ఒక మ్యాచ్ లో విజయం సాధించి, మరో మ్యాచ్ లో ఓటమిపాలవ్వాలి. ఇప్పటికే ఒక బోనస్ పాయింట్ సాధించిన ఇంగ్లండ్ మెరుగైన స్థాయిలో ఉంది. అదీ కాక, ప్రత్యర్థి ఆస్ట్రేలియా అయితే ఇంగ్లండ్ ఆడే విధానంలో పూర్తి మార్పు చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఫైనల్ కు అర్హత సాధిస్తుందా? అనే అనుమానం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. టీమిండియా సిడ్నీలో 26న ఆస్ట్రేలియాతో, 30న పెర్త్ లో ఇంగ్లండ్ తో తలపడనుంది. ఫైనల్ ఫిబ్రవరి 1న జరగనుంది.