: కాశ్మీర్లో చార్టీ హెబ్డో కార్టూన్ల కలకలం
జమ్మూ కాశ్మీర్లో చార్లీ హెబ్డో కార్టూన్ల కలకలం రేగింది. ఫ్రెంచ్ వ్యంగ్య పత్రిక చార్లీ హెబ్డో పత్రిక ప్రచురించిన ముస్లిం మత వ్యతిరేక కార్టూన్లపై నిరసన వ్యక్తం చేస్తూ జమ్మూ కాశ్మీర్లో హురియత్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీలు ఇచ్చిన ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో జమ్మూ కాశ్మీర్లో జనజీవనం స్థంబించింది. ఆందోళన మద్దతుదారులు శ్రీనగర్ లో కదం తొక్కారు. చార్లీ హెబ్డో పత్రికను విమర్శిస్తూ నినాదాలు చేశారు. పాకిస్థాన్ లోని పెషావర్ లో భారీ ఎత్తున ఆందోళన కారులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. ముస్లిం ప్రాబల్యమున్న నైజీరియాలో కూడా భారీ ఆందోళనలు జరిగాయి. కాగా, ఫ్రాన్స్ లోని చార్టీ హెబ్డో కార్యాలయంపై ఉగ్రవాదులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కార్టూన్లు ప్రచురించడం విశేషం.