: సరస్వతీ పూజ చేయాల్సిందే... గుజరాత్ లో స్కూల్స్ కు ప్రభుత్వం ఆదేశం... వివాదాస్పదం!


శనివారం నాడు ప్రతి పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా చదువుల తల్లి, హిందూ దేవత సరస్వతి దేవిని పూజించాలని గుజరాత్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేయడం విమర్శలకు తావిచ్చింది. "విద్యా దేవత, సకల కళామతల్లి అయిన సరస్వతీ దేవిని వసంత పంచమి నాడు ప్రతి మునిసిపల్ పాఠశాలలో ప్రార్థించాలి. దీనివల్ల పిల్లలకు విద్య వల్ల ఉన్నత స్థాయికి చేరుతామని తెలిసి వస్తుంది. ప్రతి స్కూల్ లో తప్పనిసరిగా విద్యా దేవి స్తోత్రాన్ని పఠించి, వందనాలు సమర్పించి, వసంత పంచమి విశిష్టతను విద్యార్థులకు తెలిసివచ్చేలా చూడాలి" అని అహ్మదాబాద్ స్కూల్ బోర్డు కార్యనిర్వహణాధికారి ఎల్.డీ.దేశాయ్ పేరిట సర్కులర్ జారీ అయింది. మొత్తం 300 గుజరాతీ మీడియం స్కూల్స్ కు ఉత్తర్వులు వెళ్లాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 10 వేల మందికి పైగా ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు. 50 వరకూ ఉర్దూ మీడియం స్కూల్స్ కు కూడా ఆదేశాలు వెళ్ళడంతో వారంతా దీన్ని నిరసిస్తున్నారు. మైనారిటీ వర్గానికి చెందిన విద్యార్థుల మనోభావాలు దెబ్బతినే ఇటువంటి ఆదేశాలు ఉపసంహరించు కోవాలని కొందరు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News