: వచ్చినప్పుడే వస్తాయి అవార్డులు: షూటర్ గగన్ నారంగ్
'పద్మ' అవార్డుల విషయంలో ఇటీవల సైనా నెహ్వాల్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా, 'పద్మ' పురస్కారాలకు ఎంపికైన వారి జాబితా కేంద్రం ప్రకటించకపోయినా, మీడియాలో మాత్రం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, భారత స్టార్ షూటర్ గగన్ నారంగ్ స్పందించాడు. అవార్డుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తానని తెలిపాడు. పనిచేసుకుంటూ పోవడమే తనకిష్టమని చెప్పుకొచ్చాడు. అవార్డుల కోసం తొందరపడనని, వచ్చినప్పుడే వస్తాయని అన్నాడు. 'పద్మ' అవార్డుల విషయంలో వివాదాల్లోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని తెలిపాడు.