: మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడికి షాకిచ్చిన కాంగ్రెస్


కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతృత్వంలో హోం, ఆర్థిక తదితర కీలక శాఖలు నిర్వహించిన చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. ఆయనకు తమిళనాడు కాంగ్రెస్ శాఖ నేడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత కొంతకాలంగా ఆయన పార్టీకి, సీనియర్ నేత కామరాజ్ కు వ్యతిరేకంగా పలుమార్లు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు టీఎన్ సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తెలిపారు. పార్టీ హైకమాండ్ పై చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై కూడా కార్తీని వివరణ అడిగామని ఆయన తెలిపారు. కాగా, కార్తీని పార్టీ నుంచి బహిష్కరించే అవకాశముందని తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News