: తిరుపతి ఉపఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన సుగుణమ్మ
తిరుపతి ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థి చదలవాడ సుగుణమ్మ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఆమె రిటర్నింగ్ అధికారికి అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో కన్నుమూయడంతో తిరుపతి నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. వెంకటరమణ సతీమణి సుగుణమ్మను టీడీపీ బరిలో నిలిపింది. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు వీలుగా అభ్యర్థులను నిలపరాదని ఇప్పటికే అన్ని పార్టీలను టీడీపీ నేతలు కోరారు. సుగుణమ్మ కూడా తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.