: ఎం.ఎస్. నారాయణతో అవే నా చివరి మాటలు: ఎల్బీ శ్రీరామ్


'ఎల్బీగారు మీ సినిమా చూసాను. అద్భుతంగా నటించారు. మీరు ఏడ్వకుండా..చూసేవారిని ఏడ్పించారు' అని ఎంఎస్ నారాయణ తనతో చివరిగా మాట్లాడారని, ఆ మాటలు ఇంకా తన చెవుల్లో మారుమ్రోగుతున్నాయని హాస్యనటుడు ఎల్బీ శ్రీరామ్ వివరించారు. ఆయన గురించి ఎంత చెప్పినా తనివి తీరదని, తామిద్దరం కలిసి అనేక సినిమాల్లో నటించామని గుర్తు చేసుకున్నారు. నేడు కిమ్స్లో ఎంఎస్ నారాయణ భౌతికకాయన్ని సందర్శించి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తెల్లారి లేస్తే ఎంతోమందిని నవ్వించే కమెడియన్లు భౌతికంగా లేకున్నా, ప్రజల గుండెల్లో వందేళ్లు నిలిచిపోతారని ఎల్బీ శ్రీరామ్ అన్నారు.

  • Loading...

More Telugu News