: విశాఖలో స్వైన్ ఫ్లూ కలకలం... కేజీహెచ్ లో ఆరేళ్ల బాలుడి మృతి


తెలంగాణను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి తాజాగా ఏపీలోనూ కాలుమోపింది. స్వైన్ ఫ్లూ లక్షణాలతో విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆస్పత్రిలో చేరిన ఆరేళ్ల బాలుడు అభిరామ్ కొద్దిసేపటి క్రితం మరణించాడు. మరోవైపు స్వైన్ ఫ్లూ లక్షణాలున్న చిన్నారి బాలిక శ్రీదేవి కేజీహెచ్ లో చేరింది. శ్రీదేవి తల్లి ఇటీవలే స్వైన్ ఫ్లూ వల్లే చనిపోయిందని తెలుస్తోంది. అభిరామ్ మృతితో అప్రమత్తమైన కేజీహెచ్ వైద్యాధికారులు శ్రీదేవి శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపారు. స్వైన్ ఫ్లూ కారణంగా అభిరామ్ మరణించాడన్న సమాచారంతో విశాఖవాసులు వణికిపోతున్నారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్వైన్ ఫ్లూ నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది.

  • Loading...

More Telugu News