: ఎమ్మెస్ హఠాన్మరణంతో షాక్ తిన్నాను: పూరీ జగన్నాథ్
ప్రముఖ హాస్య నటుడు, రచయిత ఎమ్మెస్ నారాయణ మృతికి దర్శకుడు పూరీ జగన్నాథ్ సంతాపం ప్రకటించాడు. ఆయన హఠాన్మరణం చెందడం పట్ల దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపాడు. ఎమ్మెస్ ఆత్మకు శాంతి కలగాలంటూ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నాడు. మరో టాప్ డైరక్టర్ రాజమౌళి కూడా ఎమ్మెస్ నారాయణ మృతి పట్ల స్పందిస్తూ, సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 'మిమ్మల్ని మిస్సవుతాం' అంటూ పోస్టు పెట్టారు.