: మధ్యాహ్నం 2 గంటలకు ఫిలిం ఛాంబర్ లో ఎమ్మెస్ పార్థివదేహం... రేపు అంత్యక్రియలు


ఓ మాస్టారిగా, ఓ తాగుబోతుగా తన నటనతో సగటు సినీ అభిమానిని అలరించిన ఎమ్మెస్ నారాయణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను విషాదంలో ముంచివేసింది. ఎమ్మెస్ గౌరవార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో ఎమ్మెస్ పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు. రేపు వికారాబాద్ సమీపంలోని తన ఫామ్ హౌస్ లో ఎమ్మెస్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News