: ప్రధాని మోదీకి 100 మీటర్ల లేఖ రాసిన కాన్పూర్ బాలికలు


కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'బేటీ బచావో-బేటీ పఢావో' కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హర్యానాలోని పానిపట్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాన్పూర్ కు చెందిన బాలికలు ప్రధానికి 100 మీటర్ల పొడవున్న లేఖను రాశారు. బాలికల భద్రత, విద్య తదితర అంశాలను తమ లేఖలో ప్రస్తావించారు. బాలికలు బీజేపీ నేత, కాన్పూర్ ఎంపీ మురళీ మనోహర్ జోషి ద్వారా లేఖను పంపినట్టు 'యుగ్ దధీచి బేటీ బచావో అభియాన్' సంస్థ కన్వీనర్ మనోజ్ సంగేర్ తెలిపారు. భద్రత, విద్యపై ఆ అమ్మాయిల తమ అభిప్రాయాలను లేఖలో వెలిబుచ్చారని సంగేర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News