: ఎం.ఎస్.నారాయణ కన్నుమూత


ప్రముఖ హాస్య నటుడు ఎం.ఎస్.నారాయణ ఈ ఉదయం మృతి చెందారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. నాలుగు రోజుల క్రితం భీమవరంలోని హోటల్ లో అస్వస్థతకు గురైన ఆయనను కొండాపూర్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. 1951 ఏప్రిల్ 16న పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రులో జన్మించిన ఆయన సుమారు 700కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయనకు భార్య కళాప్రపూర్ణ, పిల్లలు శశి కిరణ్, విక్రమ్ లు వున్నారు. ఆయన నటించిన నవాబ్ బాష, శుభోదయం, క్రేజీవాలా తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. ఆయన ఐదు నంది అవార్డులను అందుకున్నారు. ఎం.ఎస్.నారాయణ తొలి సినిమా ఎం.ధర్మరాజు ఎం.ఏ. ఆయన చాలా చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారు. నిన్న మధ్యాహ్నం ఆయన చనిపోయారని వార్తలు రాగా, ఆ వెంటనే కుటుంబసభ్యులు దాన్ని ఖండించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News