: ఇబ్రహీంపట్నంలో భారీ పేలుడు... తెగిపడిన వ్యక్తి చేయి, ఇద్దరు చిన్నారులకు గాయాలు


విజయవాడ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో నేటి తెల్లవారుజామున ఓ ఇంటిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇంటిలోని రఘువర్మ అనే వ్యక్తి చేయి తెగి పడింది. ఈ ప్రమాదంలో అతనితో పాటు ఇద్దరు చిన్నారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. జిలెటిన్ స్టిక్స్ కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇబ్రహీంపట్నంలోని సుందరయ్య నగర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.

  • Loading...

More Telugu News