: పాత బస్తీలో కారు బీభత్సం... పాదచారులపైకి దూసుకెళ్లిన వైనం!


హైదరాబాదులోని పాత బస్తీలో ఓ కారు కొద్దిసేపటి క్రితం బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సదరు మహిళను స్థానికులు హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తు తలకెక్కిన సదరు కారు యజమాని కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. కారు నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News