: కోర్టుల్లో నియామకాలు నిలిపివేయండి: రంగారెడ్డి జిల్లా అడ్వొకేట్ జేఏసీ
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు ఉన్నందున... కోర్టుల్లో ఎలాంటి నియామకాలు చేపట్టరాదంటూ రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్, న్యాయవాదుల జేఏసీ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. హైదరాబాదులో ఈరోజు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఉమ్మడి హైకోర్టు ఉన్న సమయంలో నియామకాలు చేపడితే... తెలంగాణ జడ్జిలకు, న్యాయవాదులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అందువల్ల, కోర్టుల్లో అన్ని రకాల నియామకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.