: స్వైన్ ఫ్లూ నేపథ్యంలో తిరుమలలో ప్రత్యేక వైద్య బృందం


స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమలలో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 26న రథసప్తమి జరగనుండడంతో భక్తులు భారీ సంఖ్యలో వస్తారని, ఈ నేపథ్యంలో స్వైన్ ఫ్లూ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఆలయ ఈవో సాంబశివరావు తెలిపారు. తిరుమల అశ్వినీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. స్వైన్ ఫ్లూ లక్షణాలున్న భక్తులు తిరుమలకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, ఏపీలో స్వైన్ ఫ్లూ ప్రభావం తక్కువగానే ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తీవ్రస్థాయిలో ఉంది.

  • Loading...

More Telugu News