: 38 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాకిస్థాన్


అరేబియా సముద్ర జలాల్లో చేపల వేట సాగిస్తున్న భారత జాలర్లను పాకిస్థాన్ సముద్ర భద్రత విభాగం అరెస్టు చేసింది. తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారంటూ భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. వారికి చెందిన 7 బోట్లను కూడా స్వాధీనం చేసుకుంది. కరాచీ పోర్టుకు సమీపంలో వీరిని అరెస్టు చేసినట్టు పాక్ వర్గాలు తెలిపాయి. అరేబియా సముద్రంలో భారత్, పాక్ లు పరస్పరం మత్స్యకారులను అరెస్టు చేస్తుండడం తెలిసిందే. కాగా, గతేడాది పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా 151 మంది భారత జాలర్లను విడుదల చేశారు.

  • Loading...

More Telugu News