: టీ-హబ్ కు రేపే భూమి పూజ


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న టీ-హబ్ కు ముహూర్తం ఖరారయింది. రేపు ఉదయం టీఎస్ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు టీ-హబ్ కు భూమి పూజ చేయనున్నారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి కేటీఆర్ మాట్లాడుతూ, టీ-హబ్ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలో పరిశోధనలకు అనుకూలమైన వాతావరణం టీ-హబ్ తో ఏర్పడుతుందని తెలిపారు. తెలంగాణ పేరు ప్రఖ్యాతులు మరింత పెరుగుతాయని అన్నారు.

  • Loading...

More Telugu News