: తాజ్ ను సందర్శించనున్న అమెరికా రెండో అధ్యక్షుడు ఒబామానే
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్ మహల్ అందాలను వీక్షించనున్న అమెరికా రెండో అధ్యక్షుడిగా ఒబామా చరిత్రకెక్కనున్నారు. ఇప్పటి దాకా అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు ఐసెన్ హోవర్ మాత్రమే తాజ్ మహల్ ను సందర్శించారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత అమెరికా అధ్యక్షుడు మరోసారి తాజ్ ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో, ఆగ్రాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 4వేల మంది భారత భద్రతా సిబ్బంది, 100 మంది అమెరికన్ సిబ్బంది ఒబామాకు రక్షణ కల్పించనున్నారు. మరోవైపు యమునా నదిలో మోటారు బోట్లతో గస్తీ చేపట్టనున్నారు.