: ఎంత డబ్బిచ్చినా అసభ్యకరమైన పాటలు రాయను: జావేద్ అఖ్తర్
డబ్బుతో తనను కొనలేరంటున్నారు బాలీవుడ్ సుప్రసిద్ధ గీత రచయిత జావేద్ అఖ్తర్. ఎంత డబ్బిచ్చినా అసభ్యకరమైన పాటలు రాయబోనని కరాఖండీగా చెప్పేశారు. జైపూర్ సాహిత్యోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యపరమైన డిమాండ్ల కారణంగా స్వేఛ్చా సృజనాత్మకత దెబ్బతింటోందా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ, రచయితల్లో రెండు రకాలుంటారని తెలిపారు. "కొందరు మార్కెట్ ను, డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని పాటలు రాస్తారు, మరికొందరు తమ అభిరుచి మేరకు పాటలు రాస్తారు. గొప్పవాళ్ల మెప్పు పొందేందుకు పాటలు రాసేవాళ్లు ఎల్లప్పుడూ ఉంటారు. అది కూడా వాణిజ్యపరమైన అంశమే" అని పేర్కొన్నారు. తాను మాత్రం డబ్బుకు ఆశపడి అశ్లీల గీతాలు రాయనని తెలిపారు.