: ఉగ్రదాడి అంటూ కాల్ చేసి... 'ఉత్తినే' అన్న యువకుడి అరెస్టు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదులు దాడి చేయనున్నారంటూ ఉత్తుత్తి బెదిరింపు ఫోన్ కాల్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. గోవాకు చెందిన 19 ఏళ్ల యువకుడు నిన్న ఉదయం ఉగ్రవాదులు దాడి చేయనున్నారంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం ఫోన్ చేసిన వ్యక్తి గురించి ఆరాతీశారు. దర్యాప్తులో అతను బెదిరింపు ఫోన్ కాల్ చేసినట్టు నిర్ధారించుకుని అతనిని అరెస్టు చేసినట్టు ఎస్పీ శేఖర్ ప్రభుదేశాయ్ తెలిపారు.