: భారతీయతకు మోదీయే చిహ్నం కాదు: కాంగ్రెస్


ప్రధానమంత్రి నరేంద్రమోదీని తమ పార్టీ నేత జనార్ధన్ ద్వివేదీ కీర్తించడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో మోదీ విజయం సాధించడం భారతీయతకే విజయమనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ మాట్లాడుతూ, ద్వివేదీ చెప్పింది కాంగ్రెస్ అభిప్రాయంగానీ, విధానంగానీ కావన్నారు. భారతీయతకు చిహ్నంగా పీఎం మోదీని చూడరాదని చెప్పారు. ఈ విషయంలో ద్వివేదీపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు పార్టీ అధినాయకత్వం చర్చిస్తుందన్నారు.

  • Loading...

More Telugu News