: పాదరక్షల వ్యాపారంలోకి 'టెక్స్ టైల్' సంస్థ అరవింద్


బ్రాండెడ్ దుస్తుల రంగంలో పేరెన్నికగన్న అరవింద్, తాజాగా పాదరక్షల వ్యాపారంలోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇండియాలో ఫుట్ వేర్ మార్కెట్ రూ.30 వేల కోట్లకు చేరిన నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మార్కెట్ వాటా లక్ష్యంగా భారీస్థాయిలో మార్కెట్లోకి రానున్నట్టు సంస్థ చైర్మన్ సంజయ్ లాల్ భాయ్ వివరించారు. కొన్ని సంస్థలతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసుకొని సొంత బ్రాండ్ ను అభివృద్ది చేయనున్నట్టు ఆయన తెలిపారు. తొలుత యారో, తొమ్మి హిల్ఫిగర్, కాల్విన్ లేయిన్ తదితరాలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ లతో అందరికీ అందుబాటు ధరల్లో తమ ఉత్పత్తులు ఉంటాయని సంజయ్ అన్నారు. కాగా, తాజా గణాంకాల మేరకు చైనా తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద పాదరక్షల తయారీ మార్కెట్ మనదే.

  • Loading...

More Telugu News