: నాన్న స్పృహలోనే ఉన్నారు: ఎంఎస్ నారాయణ కుమార్తె


తన తండ్రి ఎంఎస్ నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన కుమార్తె శశికిరణ్ తెలిపారు. హాస్యనటుడు ఎంఎస్ నారాయణ మరణించారంటూ మీడియాలో వార్తలు, సోషల్ మీడియాలో సంతాప సందేశాలు పెట్టడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి స్పృహలోనే ఉన్నారని ఆమె తెలిపారు. మలేరియాతో ఆయన బాధపడుతున్నారని, మెరుగైన చికిత్స కోసమే స్వగ్రామం నుంచి కిమ్స్ కు తరలించామని ఆమె స్పష్టం చేశారు. చికిత్సకు ఆయన బాగానే స్పందిస్తున్నారని, మెరుగైన చికిత్స అందుతోందని, త్వరలోనే ఆయన కోలుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News