: అది దేవుడి తప్పు, జీవితాంతం అనుభవించాల్సిందే!: గోవా ముఖ్యమంత్రి దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు
పుట్టుకతోనే అవయవ లోపాలతో వుండేవారు దేవుడి తప్పులకు, నిర్లక్ష్యానికి ప్రతిరూపాలని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపింది. "సమాజంలో కొందరు సోదర సోదరీమణులు పుట్టుకతోనే కొన్ని లోపాలతో పుడతారు. దేవుడి మతిమరుపుతనమే ఇందుకు కారణం. అది దేవుడి తప్పు, వారు జీవితాంతం అనుభవించాల్సిందే" అని అన్నారు. దేవుడు చేసిన తప్పులను సరిదిద్దేందుకు ఎన్జీఓ సంస్థలు కృషి చేస్తున్నాయని ఆయన వివరించారు. కాగా, ఆయన వ్యాఖ్యలు దుమారం రేపడంతో, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను విరమించుకుంటున్నట్టు తెలిపారు.