: మరోసారి ధర్నాకు 'లింగా' డిస్ట్రిబ్యూటర్స్


తమిళ నటుడు రజనీకాంత్ నటించిన 'లింగా' చిత్రం మిగిల్చిన నష్టంతో డిస్ట్రిబ్యూటర్స్ కోలుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మరోసారి ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమా ప్లాప్ కావడంతో నష్టపరిహారం ఇచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఇంతవరకు ఇవ్వాల్సిన నగదు అందకపోవడంతో ధర్నాయే శరణ్యమన్న అభిప్రాయానికొచ్చారు. ఈ నేపథ్యంలో ఏడుగురు పంపిణీదారులు ధర్నాలో పాల్గొననున్నారు. "ఇప్పటికే తొలి ధర్నా చేసి పది రోజులు అయింది. నష్టపరిహారం విషయంలో మా మధ్య స్నేహపూర్వకమైన ఒప్పందం కుదిరింది. ఇంతవరకు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందువల్ల ధర్నాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం" అని పంపిణీదారుడు సింగార వడివేలన్ తెలిపారు.

  • Loading...

More Telugu News