: హాస్య నటుడు ఎం.ఎస్.నారాయణ చనిపోయారని వార్తలు... ఖండించిన కుమారుడు విక్రమ్


ప్రముఖ హాస్య నటుడు ఎం.ఎస్.నారాయణ ఈ మధ్యాహ్నం మృతి చెందారని వచ్చిన వార్తలను ఆయన కుమారుడు విక్రమ్ ఖండించారు. ఆ వార్తలు అవాస్తవం అని తెలిపాడు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉందని, అయితే భయపడాల్సిన పరిస్థితి లేదని డాక్టర్లు తెలిపినట్టు వివరించారు. కాగా, సుమారు 500 చిత్రాల్లో నటించిన ఎం.ఎస్.నారాయణ మూడు రోజుల క్రితం భీమవరంలోని హోటల్ లో అస్వస్థతకు గురికాగా, ఆయనను కొండాపూర్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. 1951 ఏప్రిల్ 16న పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రులో జన్మించిన ఆయనకు భార్య కళాప్రపూర్ణ, పిల్లలు శశి కిరణ్, విక్రమ్ లు వున్నారు. ఆయన నటించిన నవాబ్ బాష, శుభోదయం, క్రేజీవాలా తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.

  • Loading...

More Telugu News