: సంగారెడ్డి కోర్టుకు హాజరైన ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్
మెదక్ జిల్లా సంగారెడ్డిలోని జిల్లా కోర్టుకు నేడు పలువురు నేతలు హాజరయ్యారు. పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని ప్రార్థనా మందిరం వద్ద కలెక్టరును దుర్భాషలాడిన కేసు విషయంలో వీరు జిల్లా కోర్టుకు వచ్చినట్టు తెలిసింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, మహ్మద్ పాషా ఖాద్రి, ముంతాజ్ ఖాన్, మొహిజున్ ఖాన్ లు కోర్టుకు హాజరైన వారిలో వున్నారు. కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసినట్టు ఎంఐఎం నేతల తరపు న్యాయవాది ఒకరు తెలిపారు. కాగా, జనవరి 2005లో ముత్తంగి దగ్గర కలెక్టర్, ఇతర అధికారులను దుర్భాషలాడిన కేసులో వీరిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.