: సల్మాన్ మోయినుద్దీన్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
ఇరాక్, సిరియాల్లో మారణ హోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెళుతూ పట్టుబడ్డ సల్మాన్ మోయినుద్దీన్ ను కొద్దిసేపటి క్రితం శంషాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. దుబాయ్ మీదుగా సిరియా వెళ్లేందుకు బయలుదేరిన సల్మాన్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. అయితే ఉగ్రవాద లింకుల గురించి అతడిని ప్రశ్నించాల్సి ఉందని, తమ కస్టడీకి అప్పగించమని కోరిన పోలీసుల పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందించింది. సల్మాన్ ను పది రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నిన్న తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు నేపథ్యంలో చర్లపల్లి జైల్లో ఉన్న అతడిని కొద్దిసేపటి క్రితం తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగుచూసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.