: చిన్నంపల్లి చిరుతను బంధించిన అటవీ శాఖాధికారులు... ఊపిరి పీల్చుకున్న జనం


అనంతపురం జిల్లా చిన్నంపల్లి వాసులకు గత రాత్రి నిద్ర లేకుండా చేసిన చిరుత పులిని ఎట్టకేలకు అటవీ శాఖాధికారులు బంధించారు. నిన్న సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఆపరేషన్ కొద్దిసేపటి క్రితం విజయవంతమైంది. చిరుతను బోనులో బంధించిన అటవీ శాఖాధికారులు దానిని అడవిలో వదిలేయనున్నారు. ఇదిలా ఉంటే, చిన్నంపల్లిలో చిరుతల సంచారంపై సమాచారం అందుకున్న ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గ్రామాన్ని సందర్శించారు. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ చేపట్టిన చర్యలను ఆయన దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోకి వచ్చిన రెండు చిరుతలు జనసంచారం కనపడగానే పరుగులు తీసిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి అడవిలోకి పారిపోగా, మరో చిరుత గ్రామ శివారులోని పొదల్లో నక్కింది. ఆ చిరుతను అటవీ శాఖాధికారులు బంధించారు.

  • Loading...

More Telugu News