: లారీలో భారీగా పేలుడు పదార్థాలు... ఖమ్మంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఖమ్మం జిల్లా పోలీసులు నేటి ఉదయం ఓ లారీలో భారీ సంఖ్యలో తరలివెళుతున్న పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు మండలం మొరంపల్లి వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు, ఓ లారీలో భారీ సంఖ్యలో పేలుడు పదార్థాలను కనుగొన్నారు. వాటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా సదరు పేలుడు పదార్థాలు అక్రమంగానే తరలివెళుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.