: కులం పేరుతో దూషించిన బీజేపీ నేత... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
తెలంగాణకు చెందిన బీజేపీ నేత రఘునందన్ రావు ఓ అధికారిని కులం పేరుతో దూషించారు. దీంతో ఆయనపై మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రఘునందన్ రావుపై ఎక్సైజ్ శాఖ అధికారి అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన రఘునందన్ రావు, పార్టీ అధిష్ఠానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు.