: జూబ్లీహిల్స్ లో మందుబాబుల వీరంగం... రెస్టారెంట్ యజమానిపై దాడి
హైదరాబాదులో నిత్యం రాత్రి పొద్దుపోయిన తర్వాత వీరంగం చేస్తున్న మందుబాబుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. నిన్నటికి నిన్న జహీరాబాద్ మాజీ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ తనయుడు మందు తాగి స్నేహితులతో కలిసి నడిరోడ్డుపై నానా రభస చేయగా, తాజాగా మద్యం మత్తు తలకెక్కిన కొందరు యువకులు ఏకంగా ఓ రెస్టారెంట్ యజమానిపై విరుచుకుపడ్డారు. మందుబాబుల దాడిలో సదరు రెస్టారెంట్ యజమానికి గాయాలైనట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.