: పులుల్ని ఆ రాష్ట్రం బాగా కాపాడిందట!


అంతరించిపోతున్న పులులను రక్షించాలంటూ జరుగుతున్న ప్రచారం సత్ఫలితాలు ఇస్తున్నట్టు కనబడుతోంది. పులులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ రెండో స్థానంలో నిలిచింది. చాలా కాలంగా పులుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం ఈ ఏడాది కూడా ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. కాగా, గత లెక్కింపులో ఉత్తరాఖండ్ లో 227 పులులు ఉండేవి. వాటి సంఖ్య ఇప్పుడు 340కి చేరింది. పులుల సంఖ్య ఇంతగా పెరిగినందుకు గర్వంగా ఉందని తెలిపిన కార్బెట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డైరెక్టర్ సమీర్ సంహా, ఉత్తరాఖండ్ లో కేవలం ఒకే ఒక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉందని అన్నారు. అరణ్యాలు అంతరించిపోయి, జనారణ్యం పెరిగిపోతుండడంతో జంతువులకు ఆవాసాలు లేకుండా పోతున్నాయి. అందుకు నిదర్శనంగా ఇటీవల కాలంలో తరచుగా వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తుండడం తెలిసిందే.

  • Loading...

More Telugu News