: మూడు శుభదినాలు చాలు... కప్ మనదే: ద్రావిడ్


బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ వరల్డ్ కప్ లో టీమిండియా అవకాశాలను విశ్లేషించాడు. టోర్నీలో అనుసరిస్తున్న ఫార్మాట్ దృష్ట్యా 'మూడు శుభదినాలు' చాలని, కప్ మనదే అవుతుందని తెలిపాడు. తాజా ఈవెంట్ లో గ్రూప్ దశ అనంతరం క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్ ఉంటాయి. టీమిండియా గ్రూప్ దశను అధిగమించడం ఖాయమేనన్న అంచనాల నేపథ్యంలో, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్ లు జరిగే ఆ మూడు రోజులు మనవైతే కప్పూ మనదే అవుతుందని ఈ మాజీ కెప్టెన్ వివరించాడు. "ఫార్మాట్ ను బట్టి చూస్తే టాప్-8 జట్లు క్వార్టర్ ఫైనల్స్ లో ఆడతాయి. అక్కడి నుంచి మూడు శుభ దినాలు చాలు... కప్ గెలవడానికి. మనకు ఒంటి చేత్తో మ్యాచ్ లు గెలిపించే మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఉన్నారు" అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News